బీజేపీ లో చేరిన ఈటల రాజేందర్‌

న్యూఢిల్లీ: మాజీమంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, అందె బాబయ్య తదితరులు బీజేపీలో చేరారు. ఈ రోజు ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఈటల రాజేందర్‌ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ కార్య్ర‌మానికి కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డితో పాటు ప‌లువురు బీజేపీ నేత‌లు హాజ‌ర‌య్యారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/