గోవా గవర్నర్‌ సత్యపాల్‌ బదిలీ

మేఘాలయకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

Satya Pal Malik

న్యూఢిల్లీ: గోవా రాష్ట్ర గవర్నరు సత్యపాల్ మాలిక్ ను మంగళవారం మేఘాలయకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. గోవా రాష్ట్రానికి గవర్నరుగా మహారాష్ట్ర గవర్నరు భగత్ సింగ్ కోష్యారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా గోవా గవర్నరుగా కూడా కోష్యారీ అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని రాష్ట్రపతి భవన్ ఆదేశించింది. మేఘాలయ గవర్నరుగా ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్న తథాగతరాయ్ స్థానంలో సత్యపాల్ మాలిక్ ను రాష్ట్రపతి బదిలీ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/