హిమాచల్‌ప్రదేశ్‌లో 4.1 తీవ్రతతో స్వల్ప భూకంపం

Earthquake of magnitude 4.1 hits Himachal Pradesh

సిమ్లాః హిమాచల్‌ప్రదేశ్‌లో భూ కంపం సంభవించింది. రాష్ట్రంలోని మండీలో భూకంపం వచ్చిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ సెంటర్‌ తెలిపింది. రిక్టర్‌స్కేలుపై దీనితీవ్రత 4.1గా నమోదయిందని వెల్లడించింది. మండీకి 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని చెప్పింది. భూ ప్రకంపణల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

హిమాలయ పర్వత ప్రాంతంలో గత 15 రోజుల్లో పదకొండు సార్లు భూకంపాలు సంభవించాయి. నవంబర్‌ 8 నుంచి ఇప్పటివరకు ఉత్తరాఖండ్‌-నేపాల్‌ సరిహద్దుల్లో ఈ భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని అధికారులు వెల్లడించారు. ఇక ఈనెల 14న పంజాబ్‌లోని అమృత్సర్‌, అంతకుముందు ఢిల్లీలో రెండుసార్లు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/