ఏపీ మంత్రి మంత్రి ఉషశ్రీ చరణ్‌ ఫై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఏపీ మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. 2017 ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్‌స్టేషన్‌లో ఉషశ్రీ చరణ్‌ ఫై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

188 సెక్షన్‌ కింద ఉషశ్రీ చరణ్‌తో పాటూ మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం కళ్యాణదుర్గం కోర్టులో విచారణ జరిగింది. మంత్రి కోర్టుకు రాకపోవడంతో.. మొత్తం ఏడుగురిపై కళ్యాణదుర్గం జూనియర్‌ సివిల్‌ జడ్జి వారెంట్‌ జారీ చేశారు. ఈ కేసుపై మంత్రి స్పందించాల్సి ఉంది. ఇక ఉషశ్రీ చరణ్ 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనూహ్యంగా రెండో విడత ఏపీ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కింది.