జూబ్లీ హిల్స్ రోడ్ 45 లో కారు బీభత్సం: బాలుడు మృతి

Car crash- Boy dead
Car crash- Boy dead

Hyderabad: జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో గురువారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి రోడ్డు దాటుతున్న ఒక మహిళను రాసుకుంటూ వెళ్ళింది . దీంతో ఆమె చేతుల్లో నుంచి రెండున్నరేళ్ల బాలుడు కిందపడి తలకు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే కారు డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తి కారును వదిలిపెట్టి పారిపోయాడని స్థానికులు వెల్లడించారు. . సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు చెందినదిగా గుర్తించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం :https://www.vaartha.com/andhra-pradesh/