ఏపీలో పలుచోట్ల భూప్రకంపనలు

ఆదివారం తెల్లవారుజామున ఏపీలోని పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. పల్నాడు అచ్చం పేట మండలంలో భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లిలో భూమి స్వల్పంగా కపించింది. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీర్ల పాడు మండలాల్లో భూకంపం ఏర్పడింది.

ఆదివారం ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు.. ఒక్కసారిగా రోడ్లపైకి పరుగులు పెట్టారు. అటు పులించింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కూడా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భూకంపాలు పెద్ద ఎత్తున సంభవిస్తున్నాయి. రీసెంట్ గా టర్కీ, సిరియా దేశాల్లో వరుస భూకంపాలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే సుమారు 40 వేల మంది చనిపోయారు. ఇటీవల కాలంలో జరిగిన ప్రకృతి అతి పెద్దదిగా చెబుతున్న ఈ భూకంపం ధాటికి ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారు.