ఈ నెల 28 న అనంతపురంలో ‘గాడ్ ఫాదర్’ మెగా ఫంక్షన్

ఈ నెల 28 న అనంతపురంలో గాడ్ ఫాదర్ మూవీ కి సంబంధించి మెగా ఈవెంట్ ను జరపబోతున్నారు. ఈ మెగా ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవితో పాటు గాడ్ ఫాదర్ యూనిట్ సభ్యులంతా హాజరుకానున్నారు. మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం తాలూకా ప్రమోషన్ కార్య క్రమాలు సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేస్తుండగా..ఈ నెల 28 న అనంతపురం లో మెగా ఫంక్షన్ జరపబోతున్నారు. ఈ ఫంక్షన్ కు పెద్ద ఎత్తున అభిమానులు హాజరుకానున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లలో ఈవెంట్ మేనేజ్మెంట్ బిజీ గా ఉంది. ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు. సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని వంటి స్టార్ నటి నటులు నటిస్తున్నారు.