పెను ప్రమాదం నుండి బయటపడ్డ ఎమ్మెల్యే సీతక్క

ములుగు ఎమ్మెల్యే సీతక్క పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ములుగు ప్రాంతంలోని చాల గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ క్రమంలో ముంపు గ్రామాల్లో సీతక్క పర్యటిస్తూ వస్తున్నారు. కాగా వరద సహాయక చర్యల్లో భాగంగా బోటుపై వెళ్తుండగా గోదావరి నదిలో బోటు ఉన్నట్టుండి ఆగిపోయింది. ఆలా కాసేపటికి బోటు పక్కకు కొట్టుకు వచ్చి చెట్టుకు తగిలి ఒడ్డుకు చేరుకుంది. దీంతో అడవి మధ్యలో నుంచి కాలినడకన ఎమ్మెల్యే సీతక్క బయటకు వచ్చింది. ఈ ఘటన ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లిలో జరిగింది.

వారం రోజులా పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు పలు ప్రాజెక్ట్ లు పొంగిపొర్లడం తో ముంపు గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. దీంతో వారంతా తినేందుకు తిండి లేక , తాగేందుకు మంచి నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సీతక్క వారికీ సాయం చేసేందుకు కదం తొక్కింది. తనవంతు సాయం గా వారికీ ఆహారం , పండ్లు , కూరగాయలు , నిత్యావసర వస్తువులను అందజేస్తూ వస్తున్నారు. వర్షాలతో ఇబ్బందులు పడుతున్నవారికి, వరదల కారణంగా నష్టపోయిన వారికి సాయం చేయాలని సీతక్క పిలుపునిచ్చారు. ఎందరో పేదలు కనీసం ఆహారం కూడా లేక అలమటిస్తున్నారని, చేయిచేయి కలిపి వారందరినీ ఆదుకోవాలని కోరారు. సీతక్క పిలుపు మేరకు చాలామంది ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారు.