లాలూ పై సిబిఐ కేసు నమోదు

అప్పట్లో ఉద్యోగాల భర్తీలో అవకతకలకు పాల్పడ్డారనే అభియోగం

CBI registers case against Lalu
CBI registers case against Lalu

Patna: బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ పై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. పశువుల దాణా కుంభకోణంలో కొద్ది వారాల కిందట ఆయనకు బెయిల్ లభించిన సంగతే తెలిసిందే.. ఇపుడు ఆయనపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. 2004 నుంచి 2009 వరకు కేంద్ర రైల్వే మంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీలో అవకతకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ లాలూతో పాటు , ఆయన కుటుంబసభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/