కొవ్వును కరిగించే లేత కొబ్బరి
ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రకృతిలో వరంలా వచ్చిన వాటిలో కొబ్బరిబోండాం ఒకటి. కొబ్బరి బొండాం నీళ్ల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని మనకు తెలుసు.
ఎండాకాలంలో కొబ్బరి నీళ్లను మించిన ఎనర్జీ డ్రింక్ మరొకటి లేదని తెలుసు.
కొబ్బరి నీళ్లే కాదు, కొబ్బరి బోండాంలోని లేత కొబ్బరి వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయి. లేత కొబ్బరిలో పీచు పదార్థం ఉంటుంది.
ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురుగ్గా మార్చేస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్లు లేత కొబ్బరి తినాలి.
లేత కొబ్బరి మన శరీరంలో నీటి శాతం కోల్పోకుండా చేస్తుంది. ఎండాకాలం డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు.
శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్‌ను లేత కొబ్బరి బయటకు పంపేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
అవి గుండెకు మేలు చేస్తాయి. బాడీలో వ్యర్ధాల్ని బయటకు పంపుతాయి. పాడైన కణాల్ని రిపేర్ చేస్తాయి.
లేత కొబ్బరిలో విటమిన్ ఎ,బి,సి థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము ఎక్కువగా ఉంటాయి.
మలబద్ధకానికి సరైన ఉపశమనం. రెండ్రోలకోసారి ఈ కొబ్బరి తిన్నా చాలు. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.
కొబ్బరి కాయల్లో పచ్చి కొబ్బరిని ఎక్కువగా తింటే దగ్గు, నిమ్ము, ఆయాసం వంట సమస్యలొస్తాయి.
అదే లేత కొబ్బరి అయితే ఒక పట్టు పట్టవచ్చు. పెద్దగా సమస్యలేవీ ఉండవు. అందువల్ల వీలు చిక్కినప్పుడల్లా లేత కొబ్బరి తినండి ఆరోగ్యాన్ని పెంచుకోండి.
తాజా బిజినెస్ వార్తల కోసం:https://www.vaartha.com/news/business/