మూసీ నిరాశ్రయులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లులు

హైదరాబాద్ మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టుతో నిరాశ్రయులయ్యే నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ నదికి ఇరువైపులా దాదాపు 50వేలకు పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నేపథ్యంలో వీరందరినీ ఖాళీ చేయించాల్సి ఉంటుంది. దీంతో గత ప్రభుత్వంలో పంపిణీ చేయకుండా మిగిలిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిరాశ్రయులకు ఇవ్వనుంది. త్వరలోనే విధివిధానాలు ఖరారయ్యే ఛాన్సుంది.

అసంపూర్తిగా ఉన్న గృహాలను పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 400 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించడంతో త్వరలోనే పనులు చేపట్టనున్నారు. నగరం మధ్య నుంచి దాదాపు 50 కిలోమీటర్ల మేర మూసీనది ప్రవహిస్తున్నది. దానికి ఇరువైపులా 50 వేలకుపైగా కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పంపిణీ చేయకుండా మిగిలి ఉన్న డబుల్‌ బెడ్రూం ఇండ్లను నిరాశ్రయులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్‌ ప్రభుత్వం రూ. 12,272.61కోట్లు ఖర్చుచేసి 1,94,859 డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టింది. అందులో 1,48,521 గృహాలు పూర్తికాగా, మిగిలిన 46,338 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో పదివేలకుపైగా ఇండ్లు తుదిదశలో ఉన్నాయి.