నాగ‌బాబుకు క‌రోనా పాజిటివ్‌

nagababu

హైదరాబాద్‌: నటుడు, నిర్మాత నాగబాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ లో వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపిన నాగబాబు.. కరోనా నుండి త్వరగా కోలుకుని ప్లాస్మా దానం చేస్తానని పేర్కొన్నారు. మరోవైపు నాగబాబు ట్వీట్‌ చేసిన వెంటనే మెగా అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
అయితే గ‌త కొన్నిరోజులుగా నాగ‌బాబు ఓ ఛాన‌ల్‌లో వ‌చ్చే కామెడీ షోలో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. బ‌హుశా అక్క‌డి నుంచే వైర‌స్ సోకి ఉండొచ్చు అంటున్నారు. ఏదేమైనా ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నాగ‌బాబు సూచించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/