పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేరింత బ్యూటీ

కేరింత సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచమై..మొదటి సినిమాతోనే యూత్ కు దగ్గరైన నటి సుకృతి. కేరింత సినిమాలో భావన రోల్ లో ఈమె నటించి , మెప్పించింది. సుమంత్ అశ్విన్ హీరోగా న‌టించగా శ్రీదివ్య హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రంలో హీరోయిన్‌కు స‌మానంగా ఉండే పాత్రలో సుకృతి నటించింది. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌, క్యూట్ ఎక్స్‌ప్రేష‌న్స్‌తో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఈమె సినిమాల‌ను దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను , సినీ లవర్స్ కు , నెటిజన్లకు దగ్గరగా ఉంటుంది. కాగా ఈ బ్యూటీ అతి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

అక్ష‌య్ సింగ్ అనే వ్య‌క్తితో ఈమెకు నిశ్చితార్థం జ‌రిగింది. ఈ వేడుక‌కు సంబంధించిన ఫోటోలను ఈ జంట త‌మ త‌మ‌ సోషల్ మీడియా పేజీ లలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సుకృతి ఇన్స్టాగ్రామ్‌లో ‘నా ప్రపంచం నాన్న‌. భ‌య‌ప‌డిన‌ప్పుడు నా భుజం తడుతూ, న‌న్ను సంతోష‌ప‌రుస్తూ, నా చేయి ప‌ట్టుకుని న‌డిపిస్తూ నిత్యం నా వెంటే ఉన్నాడు. ఎప్పుడు ఉత్త‌మ నాన్న‌లాగే ప్ర‌వ‌ర్తించాడు. ఐదేళ్ళ క్రీతం అమ్మ చ‌నిపోయింది. అప్ప‌టి నుండి అమ్మ ప్రేమ‌ను సైతం తానే అందించాడు. సింగిల్ పేరెంట్‌గా ఉండటం అంత సులువేం కాదు. నాకు తెలిసిన బ‌ల‌మైన వ్య‌క్తివి నువ్వే నాన్న‌.. ఎప్ప‌టికీ నువ్వే నా ఫ‌స్ట్ ల‌వ్’ అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చింది.