కశ్మీర్‌ గురించి మీరేం చింతించకండి

అమెరికా సెనెటర్‌కు ఘాటుగా సమాధానమిచ్చిన భారత విదేశాంగ మంత్రి

s jaishankar
s jaishankar

బెర్లిన్‌: కశ్మీర్‌ గురించి మీరేం బాధపడకండి సెనెటర్‌ ఈ అంశాన్ని ఒకే దేశం పరిష్కరిస్తుందని భారత విదేశాంగశాఖ మంత్రి జై శంఖర్‌ అమెరికా సెనెటర్‌కు ధీటుగా సమధానం ఇచ్చారు. వివారాలలోకి వెళ్తే అమెరికాకు చెందిన సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌..ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అత్యంత సన్నిహితురాలు. ఆమె తాజాగా జర్మనీలోని మ్యూనిచ్‌ నగరంలో భద్రతకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో కశ్మీర్‌ ప్రస్తావన లేవనెత్తారు. దీంతో భారత విదేశాంగ మంత్రి జై శంఖర్‌ తనదైన శైలిలో ఆమెకు బదులిచ్చారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ..కశ్మీర్‌ విషయానికి వస్తే అదెలా ముగుస్తుందో నాకు తెలియదు…కానీ రెండు దేశాల్లో ఏదో ఒకటి తొందరగా ఈ అంశాన్ని పరిష్కారం దిశగా తీసుకెళ్లాలి అంటూ లిండ్సే పేర్కొన్నారు. దీనిపై జై శంకర్‌ బదులిస్తూ కశ్మీర్‌ గురించి మీరు బాధపడకండి సెనెటర్‌..ఆ అంశాన్ని ఒకే దేశం పరిష్కరిస్తుంది. ఆ దేశం ఏదో కూడా మీకు తెలుసు అంటూ ఆమెకు ఘాటుగా సమాధానమిచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/