నేటి నుంచి కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల యాగం

విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆధ్వర్యంలో యాగం

cm-kcr-will-be-conducting-the-rajashyamala-yagam-from-today

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న సిఎం కెసిఆర్‌ రాజశ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు. నేటి నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కెసిఆర్ యాగాన్ని నిర్వహిచనున్నారు. కెసిఆర్‌కు సెంటిమెంట్‌గా మారిన రాజశ్యామల యాగానికి మరోమారు శ్రీకారం చుడుతున్నారు. సొంత వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజుల పాటు రాజశ్యామల యాగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. యాగంలో పాల్గొనేందుకు ఇప్పటికే కెసిఆర్ ఫాంహౌస్‌కు చేరుకున్నారు.

ఎన్నికల ప్రచారం ముగించుకుని మంగళవారం సాయంత్రమే కెసిఆర్ ఫామ్ హౌస్‌కి చేరుకున్నారు. ఉదయం 3 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో యాగం ప్రారంభం కానుంది. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగం ఐదు రోజుల పాటు జరగనుంది.

ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన 200 మంది వేదపండితులు, రుత్విక్కులతో యాగం నిర్వహించనున్నారు. రాజశ్యామలా అమ్మవారు, చండీ అమ్మవార్లతో పాటు ఐదుగురిని ఆవాహనం చేసుకొని హోమం నిర్వహించనున్నారు. సంకల్పంతో యాగాన్ని ప్రారంభించారు. రెండో రోజు వేద పారాయణాలు , హోమం చివరి రోజు పుర్ణావుతితో యాగం ముగియనుంది.

ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగాన్ని నిర్వహించడం కొంత కాలంగా కెసిఆర్‌కు సెంటిమెంట్‌గా మారింది. గతంలో కూడా ఎన్నికలకు ముందు శారదాపీఠాధిపతి ఆధ్వర్యంలో ఈ యాగాన్ని నిర్వహించి విజయం సాధించడంతో ఈ సారి కూడా దానిని కొనసాగిస్తున్నారు. యాగాన్ని నిర్వహించిన ప్రతిసారి విజయం వరించడంతో హ్యాట్రిక్ సాధించాలనే అకాంక్షతో మరోమారు యాగానికి తలపెట్టారు.

సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని వ్యవయసాయ క్షేత్రంలో మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు యాగంలో పాల్గొననున్నారు.

సిఎం కెసిఆర్ 2018 ఎన్నికలకు ముందు కూడా రాజ శ్యామల యాగం చేసి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాదింాచరు. ఎన్నికలలో విజయం తరువాత కూడా సహస్ర చండీ యాగం చేశారు. కెసిఆర్ యాగం చేసిన ప్రతిసారి భగవదానుగ్రహం పొందారని..రాజ శ్యామల యాగంతో తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.