కోవిడ్‌-19 పై చైనా కొత్త యుద్ధం

3 వేల ఏళ్లనాటి వైద్య విధానంతో చికిత్స

China Tries Old Remedy
China Tries Old Remedy

బీజింగ్‌: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌ బారిన పడి ఇప్పటికే చైనా పరిస్థితి గాడి తప్పింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వైరస్‌కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. కాగా ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడి 1662 మంది మృతి చెందగా 60 వేల మందికి పైగా ఈ వైరస్‌ సోకింది. అయితే ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి చైనా ప్రభుత్వం వైద్య విధానాన్ని సమూలంగా మార్చేయాలని నిర్ణయించుకుంది. వైద్య విధాన మూలాల్లోకి వెళ్లనుంది.

ఈ వైరస్‌ను నియంత్రించడంలో భాగంగా- చైనా సంప్రదాయ మందులు, వైద్య విధానాలను అనుసరిస్తోంది. దీనికోసం ఇప్పటికే కొంతమంది సంప్రదాయ వైద్యులను బరిలోకి దింపింది. వుహాన్ సిటీ సహా హ్యుబే ప్రావిన్స్‌లోని కొన్ని ఆసుపత్రుల్లో ఈ తరహా వైద్య విధానాన్ని ఆరంభించింది. దీనికోసం 3000 సంవత్సరాల కిందటి వైద్య విధానానికి సంబంధించిన నైపుణ్యం గల వారు, సంప్రదయ వైద్యుల సహకారాన్ని తీసుకుంటున్నామని చైనా వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారి, హ్యుబే ప్రావిన్స్ కొత్త హెల్త్ కమిషనర్ ఛైర్మన్ వాంగ్ హెషెంగ్ తెలిపారు. చైనా సంప్రదాయ వైద్య విధానం, మందులను మేళవించి, ఆధునిక పద్ధతుల్లో కరోనా రోగులకు చికిత్సను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీని ఫలితాలు ఏమిటనేది ఇంకా తెలియరావాల్సి ఉందని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/