‘అమ్మ’ ఫొటోలతోనే స్టాలిన్ స్కూల్ బ్యాగుల పంపిణి

ఈరోజుల్లో గత ప్రభుత్వ నిర్ణయాలను ..పథకాలను పక్కకు పెట్టి..కొత్త పథకాలు తీసుకొస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గిస్తుంటే.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం గొప్ప నిర్ణయం తీసుకొని అందరికి ఆదర్శమవుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సిన 65లక్షల స్కూల్ బ్యాగ్ లపై మాజీ ముఖ్యమంత్రులు జయలలిత,ఎడప్పాడి పళనిస్వామి ఫోటోలు ఉన్నాయి.

అయితే వాటిని పక్కకు పెట్టకుండా అవే కొనసాగించాలని స్టాలిన్ నిర్ణయం తీసుకున్నాడు. మళ్లీ కొత్త బ్యాగుల వల్ల ప్రభుత్వ ఖజానా కు నష్టమే తప్ప లాభం లేదని..ఇలా ఆ బ్యాగులే ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.13కోట్లు ఆదా అవుతాయని స్టాలిన్ నిర్ణయించారు. అలా ఆదా అయిన డబ్బుని విద్యార్ధుల కోసం ప్రవేశపెట్టే మరో సంక్షేమ పథకంలో ఉపయోగించాలని తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోజికి సూచించారు. ఇంత గొప్ప నిర్ణయం స్టాలిన్ తీసుకోవడం పట్ల అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.