ఉగ్రదాడి: అమరులైన ఇద్దరు జవాన్లు

శ్రీనగర్‌లోని లవాయ్‌పోరా సమీపంలో ఘటన

Inspections by CRPF officers in the Lavaipora area
Inspections by CRPF officers in the Lavaipora area

Srinagar: సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు, శ్రీనగర్‌లోని లవాయ్‌పోరా సమీపంలో జరిగింది.

లష్కరే తోయిబా దాడికి పాల్పడిందని సీఆర్పీఎఫ్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఈ దాడి అనంతరం లవాయ్‌పోరా ప్రాంతాన్ని సీఆర్పీఎఫ్ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/