ఆత్మస్థైర్యమే బలమైన భుజాలు

Jessika

రోజూ స్కూల్‌ నుంచి వచ్చాక ఆ చేతులను ఎలా ఊపయోగిం చాలన్న విషయం మీద ప్రాక్టిసు ఉం డేది. పద్నాలు గేళ్ల వరకు కృత్రిమ చేతుల తోనే జెస్సికా తన బాల్యాన్ని దాటింది. కాని ఎన్నిరోజులు గడిచినా అవి కృత్రిమ చేతులనే ఆమెకు అనిపించాయి తప్ప తన చేతులు అని పించలేదు. నావైన నా కాళ్లు ఉన్నాయి కదా వాటినే చేతులుగా మార్చు కుందామని నిర్ణయించుకుని, ఆ చేతులను పక్కకు ప డేసిన రోజున ఆమె జీవితం మలుపు తిరిగింది.

అందంగా లేనని ఆత్మహత్యకు పాల్పడే వారున్నారు. నల్లగా ఉన్నాననే భావనతో ఆత్మన్యూనతతో బాధపడే అమ్మాయిలు ఉన్నారు. పొట్టిగా, లావ్ఞగా వ్ఞన్నానని నిరుత్సాహంతో, నిరాశ నిర్వేదనతో కుమిలిపోతున్న అమ్మాయిలకు కొదువ లేదు. అన్ని సవ్యంగా ఉంటే నేను గొప్పదాన్ని కాగలనని, అనుకున్నది సాధించగలనని అంటుంటారు. వసతులు వ్ఞంటే ఎదిగేందుకు సులభమని అనుకుంటారు. ఇవన్నీ సాకులు మాత్రమేనని జెస్సికాకాక్స్‌ని చూసి చెప్పొచ్చు.

జీవితంలో కష్టాలు వ్ఞంటాయి. కానీ అన్ని సవ్యంగా వ్ఞండాల్సిన అవయవాలు లేకపోతే ఇక ఈ జీవితం ఇంతేనని ఇంట్లో మూలుగుతూ కూర్చునేందుకు ఇష్టపడేవారు లేకపోలేదు. అంతేందుకు కాస్త జబులు చేస్తే చాలు హైరానా పడిపోతారు. జ్వరం వస్తే ఆఫీసుకు సెలవ్‌పెట్టి నిద్రపోతారు. ఇఎంఐ కట్టలేని పరిస్థితి వస్తే, అప్పులు ఎక్కువైపోతే ఆత్మహత్యే శరణ్యమనుకుంటారు. ఇలా చేసుకున్నవారు మన సమాజంలో తక్కువేమీ లేరు. అనుకోని అవాంతరం ఎదురైతే దానినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమస్య నుంచి బయటపడాలనే తపనే తప్ప దానినుంచి గుణపాఠాలను నేర్చుకుందామనే ఆశ వ్ఞండదు. చిన్న కష్టం వస్తే చాలు, భవిష్యత్తు అంతా అంధకారంగా కనిపిస్తుంది.

ఇక ఆ కష్టం శాశ్వతం అని తెలిస్తే? అప్పుడు సీతాకోకచిలుకలా ఎగిరే ధైర్యం తెచ్చుకుంటామా? గగనాన్ని సవాలు చేయగల ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటామా? ఈ జీవితం మెడలు వొంచి ముందుకు సాగగలమా అని దిలాసాగా అనుకోగలుగుతామా? ఈమె, 36 సంవత్సరాల జెస్సికా కాక్స్‌ అనుకుంది. కనుక ఇవాళ ప్రపంచమంతా ఆమెను చూస్తోంది.

ఆమెను వింటోంది. ఆమె మాటలకు ఇన్‌స్పయిర్‌ అయ్యి ఎదురయ్యే సవాళ్లను ముక్కముక్కలు చేయడం నేర్చుకుంటోంది. ఆగడం, ఆపేయడం చెడ్డ అలవాట్లు. ముందుకు సాగడం జెస్సికా కాక్స్‌ను చూసి నేర్చుకోవాల్సిన మంచి అలవాటు అమెరికాలో అరిజోనా రాష్ట్రంలోని టక్సన్‌ ప్రాంతంలో 1983లో జెస్సికా జన్మించినప్పుడు ఆమెకు ఇరుభూజాలు లేకపోవడాన్ని చూసి తల్లిదండ్రులు స్థాణువయ్యారు. గర్భంలో ఉన్నప్పుడు చేసిన స్కానింగ్‌ రిపోర్ట్స్‌ సాధారణంగా ఉన్నాయని భావించడం వల్ల లోపల ఉన్న పాపాయికి భూజాలు లేకుండే పుట్టే ఒక అరుదైన రుగ్మత ఉన్నట్లు కనిపెట్టులేకపోయారు. ఇటువంటి అనూహ్యత ఎదురైనప్పడు ఏ తల్లిదండ్రులైనా ఏడుస్తూ మూల కూర్చుంటారు.

కాని జెస్సికా తల్లిదండ్రులు మొదట తమ పాపకు భూజాలు లేవు అన్న వాస్తవాన్ని స్వీకరించారు. అయితే ఆమెను అందరు పిల్లలకు భిన్నంగా పెంచాలనే ఆలోచనను మానుకున్నారు. తాను అందరిలాంటి దాన్నే అనే భావం కలగేలా జెస్సికాను మామూలు స్కూల్లోనే వేశారు. మామూలు పిల్లలతోనే ఆడుకునేలా చేశారు. అయితే ఈ పిల్లలు ఆమెకు చేతులు లేవని ఎక్కువ ప్రేమగా కన్సర్న్‌గా చూడటం జెస్సికాకు విసుగు పుట్టేది.

తనకు తానుగా ఆడుకోవాలని కోరికతో తహతహలాడేది. జెస్సికాకు ఐదారేళ్లే వయసులోనే కృత్రిమ చేతులు పెట్టారు. రోజూ స్కూల్‌ నుంచి వచ్చాక ఆ చేతులను ఎలా ఊపయోగించాలన్న విషయం మీద ప్రాక్టిసు ఉండేది. పద్నాలుగేళ్ల వరకు కృత్రిమ చేతులతోనే జెస్సికా తన బాల్యాన్ని దాటింది. కాని ఎన్నిరోజులు గడిచినా అవి కృత్రిమ చేతులనే ఆమెకు అనిపించాయి తప్ప తన చేతులు అనిపించలేదు. ఇవి నాకెందుకు నావైన నా కాళ్లు ఉన్నాయి కదా వాటినే చేతులుగా మార్చుకుందామని నిర్ణయించుకుని, ఆ కృత్రిమ చేతులను పక్కకు పడేసిన రోజున ఆమె జీవితం మలుపు తిరిగింది. అప్పటివరకు జెస్సికా తనను తాను సాధన చేసుకోవడం నేర్చుకుంది. కాళ్లతో షూస్‌ వేసుకోవడం, ఈత కొట్టడం, టైప్‌ చేయడం కారు నడపడం అంతేకాదు యుద్ధవిద్య టైట్వాండోలో ఆమె అతి త్వరలో బ్లాక్‌ బెల్ట్‌ సాధిం చింది. పియానో వాయించడం నేర్చుకుంది.

అంతదాక ఎందుకు,, కళ్లల్లో కాంటాక్ట్‌ లెన్సులు పెట్టుకోవడం తీయడం కూడా ఆమె కాళ్లతో అతి సులువుగా చేయగలదు. శారీరక పరిమితులు ఉన్నాయనుకుని మెదడు వేసే బంధనాలు తెంచుకోవడంలోనే అసలు విజయమంతా ఉందని జెస్సికా కాక్స్‌ చెబుతుంది. ఫిలాసఫీలో డిగ్రీ చేశాక ఆమెకు విమానం నడపాలనే కోరిక పుట్టింది. కొత్తలో
ఈ ఆలోచనకు భయపడ్డా, ఆమెకు ట్రాయినింగ్‌ ఇచ్చే ఏవియేషన్‌ క్లబ్బులు సందేహించినా 2005లో ఆమె ఇందుకుగాను ట్రైయినింగ్‌ మొదలుపెడితే అనేక ప్రయత్నాలు, వైఫల్యాల తర్వాత 2008లో ఆమెకు అనుమతి పత్రం లభించింది.

పెడల్స్‌లేని లైట్‌ వెయిల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపడానికి ఇప్పుడు జెస్సికా దగ్గర లైసెన్స్‌ ఉంది. ఇలాంటి లైసెన్స్‌ పొందిన మహిళ ఈమె ఒక్కతే. జెస్సికా విజయగాథ విని దాదాపు ఇరవై దేశాల యూనివర్సిటిలో స్పూర్తిదాయక ప్రసంగాల కోసం ఆమెను ఆహ్వానించాయి. ఆమె స్వయంగా మోటివేషనల్‌ స్పీకర్‌గా జనాలను ఉత్తేజ పరుస్తుంటుంది. ట్వయికోండో శిక్షణలో పరిచయమైన పాట్రిక్‌ను ఆమె వివాహం చేసుకుంది. వారిద్దరూ సంతోషంగా ఒకరికొకరు ససోర్టుగా ఉంటూ జీవితం సాగిస్తున్నారు. మీ కలలో కేవలం రెండు భూజాలు మాత్రమే ఉన్నాయన్నభావనని మొదట తీసేయ్యండి. మీకు వేయి భూజాలు ఉన్నాయని నమ్మినప్పుడే దేన్నయినా సాధిస్తారు. అని ఆమె అంటుంది. భూజాలు లేని జెస్సికా ఇన్ని సాధించినపుడు రెండు భూజాల ఐశ్వర్యం ఉన్న మనం ఎన్ని సాధించాలి?

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/