కుంగుబాటు వద్దు

వ్యక్తిత్వ వికాసం-

Personality development
Personality development

మనదేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక సమస్యలో సతమతమవుతున్నారు. లాన్సెట్‌ సైకియాట్రిలో దీని గురించి ప్రత్యేక వ్యాసమే వెలువడింది. ఆందోళన, కుంగుబాటు ఎక్కువ మందిని బాధిస్తున్నాయి.

ఇది యువతలో మరీ ఎక్కువ. చాలా మంది తమలోని ఆందోళనను గుర్తించగలుగుతున్నా, కుంగుబాటు గురించి మాత్రం తెలుసుకోతున్నారు. మరి దీన్ని ఎలా గుర్తించాలంటే నా జీవితం ఎందుకిలా? అని నిరాశతో ఎక్కువ ఆలోచిస్తుంటారు.

రాత్రి ఎప్పుడోగాని నిద్రపట్టదు. ఉదయం లేవాలనిపించదు. ఏ పనైనా సరే చిటికెలో పూర్తి చేసే వీరు ఏ పని చేయడానికి ఇష్టపడరు. పని మొదలు పెట్టడానికే భయపడతారు.

ఇన్ని రోజులు అందరినీ పలకరించి కలివిడిగా గడిపిని వారే ఇప్పుడు ఎవరైనా పలకరిస్తే విసుక్కుంటారు. అసహనం, కోపం పెరిగిపోతాయి. ఎంత కష్టపడి చదివినా రేపు పరీక్ష బాగా రాయలేనేమోనన్న దిగులు వీళ్లని వెంటాడుతుంది.

నేనే పనీ బాగా చేయలేనేమో అని కలత చెందుతారు. పుస్తకం ముందర ఉన్నా మనసంతా ఎక్కడో ఉంటుంది. ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేరు. ప్రాధాన్యాన్ని బట్టి పనులను విభజించుకోవాలి. కష్టమైన పనులనే ముందుగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఇది ధైర్యాన్నిస్తుంది. క్రమంగా ఆత్మవిశ్వాసంతో మరో

్కపని మీద దృష్టి పెడతారు. సంతృప్తి ప్రతికూలతలను దూరం చేస్తుంది. ఏ పనిచేసినా అనుభూతి చెందుతూ, ఆస్వాదిస్తూ చేయడం మరచిపోవద్దు.

మంచి పుస్తకాలను చదవడం అలవాలు చేసుకోవాలి. పుస్తకాలు చదివితే విభిన్నంగా ఆలోచించడం, జ్ఞాపకశక్తి పెరగడం వంటి ఎన్నో లాభాలుంటాయి వాట్సాప్‌,

ఎఫ్‌బిలో ఫ్రెండ్స్‌ స్టేటస్‌లు, మెసేజ్‌లు చూసే కొద్ది అన్ని ఇలాంటివే ఉంటాయి. వాటి నుండి బయటకు రాలేరు.

అందుకే రోజులో కొంత సమయం మాత్రమే ఫోన్‌ కోసం కేటాయించాలి. కొందరికి డాన్స్‌ చేస్తే కిక్కొస్తుంది. మరికొందరు ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్‌ చేస్తే సంతోషంగా ఉంటారు.

ఇలా ఏదైనా సరే మీకు నచ్చిన అభిరుచులను చేయడానికి ప్రయత్నించండి. వీటితో ఎక్కువ సేపు గడిపారనుకోండి. మీ లోని ప్రతికూల ఆలోచనలన్నీ తొలగిపోతాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/