25 నుండి దేశీయ విమానాలు ప్రారంభం

విమానయాన సంస్థలకు సూచించిన కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ

flights

న్యూఢిల్లీ: ఈనెల 25 నుండి దేశీయ పౌర విమానయాన సేవలు పునఃప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ వెల్లడించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని దేశంలోని అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలకు సూచిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల జాగ్రత్తలకు సంబంధించిన మార్గదర్శకాలను విమానయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా విడుదల చేస్తుందని తెలిపారు. ప్రధానంగా ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించి, వ్యాధి లక్షణాలు లేనివారినే ప్రయాణానికి అనుమతించనున్నారు. భౌతిక దూరం కోసం విమానాల్లోని మధ్య సీట్లను ఖాళీగా ఉంచాలని తాము భావించట్లేదని హర్దీప్‌ సింగ్‌ పూరీ చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/