తెలంగాణలో కరోనా లేదు : మంత్రి ఈటల

Eetala Rejendar
Eetala Rejendar

Hyderabad: తెలంగాణలో కరోనా వైరస్ లేదని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. గాంధీ మెడికల్‌ కాలేజీ లైబ్రరీ బిల్డింగ్‌ను ప్రారంభించిన మంత్రి ఈటల.. ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కరోనా విషయంలో వైద్యశాఖ అప్రమత్తంగా ఉందన్నారు. కరోనాను అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. తెలుగు రాష్ర్టాల ప్రజలకు ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ఇక చైనా నుంచి వచ్చిన వ్యక్తులను 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఛాతీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లోనూ ఐసోలేషన్‌ వార్డులను ప్రారంభించామని మంత్రి గుర్తు చేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/