ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆదాయం ఎంతో తెలుసా..?

Tirumala Temple
Tirumala Temple

2022 కు గాను తిరుమల శ్రీవారి ఆదాయం రూ.1,320 కోట్లు వచ్చాయి. గడిచిన రెండేళ్లు కరోనా కారణంగా భక్తులు పెద్దగా దర్శనానికి ఇంట్రస్ట్ చూపించలేదు. దీంతో ఈ రెండేళ్లు శ్రీవారి ఆదాయం బాగా తగ్గింది. కానీ 2022 కరోనా తగ్గుముఖం పట్టడం , కరోనా ఆంక్షలు కూడా లేకపోవడం తో వివిధ రాష్ట్రాల నుండి శ్రీవారిని దర్శించుకునేందుకు పోటీపడ్డారు. దీంతో శ్రీవారి ఆదాయం కూడా భారీ ఎత్తున వచ్చింది.

దీంతో ఈ ఏడాది తిరుమల వెంకన్నకు కేవలం హుండీ కానుకల రూపేణా రూ.1,320 కోట్లు లభించింది. ఈ మేరకు టీటీడీ శ్వేతపత్రంలో పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ ఏడాది ఇప్పటిదాకా స్వామివారిని 2.35 కోట్ల మంది దర్శనం చేసుకున్నారని… 1.08 కోట్ల మంది భక్తుల తలనీలాల మొక్కులు సమర్పించుకున్నారని… 11.42 కోట్ల లడ్డూల విక్రయాలు జరిగాయని టీటీడీ వివరించింది.

ఇదిలా ఉంటె తిరుపతి, చిత్తూరులోని కెవిఆర్‌ జ్యూవెలర్స్‌ వ్యవస్థాపకులు కెఆర్‌ నారాయణమూర్తి, సతీమణి కెఎన్‌ స్వర్ణగౌరి ఇతర కుటుంబ సభ్యులు కలిసి గురువారం తిరుమల శ్రీవారికి మూడు రకాల స్వర్ణాభరణాలను విరాళంగా అందించారు. 1756 గ్రాములు బరువుగల ఈ ఆభరణాల విలువ దాదాపు రూ.1.30 కోట్లు. వీటిలో మూలవిరాట్‌ కోసం ఒక జత కర్ణాభరణాలు, శ్రీ మలయప్ప స్వామివారికి యజ్ఞోపవీతం, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి విలువైన రాళ్లు పొదిగిన మూడు పతకాలు ఉన్నాయి. కాగా ఇదే దాత గతేడాది డిసెంబరులో సుమారు రూ.3 కోట్లు విలువైన కటి, వరద హస్తాలను శ్రీవారికి కానుకగా అందించారు.