ఈ ఏడాది తెలంగాణ లిక్కర్ ఆదాయం ఎంతో తెలుసా..?

తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా జరుగుతాయనే సంగతి తెలిసిందే. రాష్ట్ర ఖజానా నిండడానికి లిక్కర్ అమ్మకాలే కారణం. లిక్కర్ తో వచ్చిన ఆదాయంతోనే సంక్షేమ పధకాలు నడుస్తున్నాయి. ఇక ఏడాది ఏడాదికి లిక్కర్ అమ్మకాల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం లేదు. గత ఏడాది కంటే ఈ ఏడాది లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. 2022లో జనవరి 1 నుంచి డిసెంబర్​ 30వ తేదీ వరకు ఏకంగా రూ.34,117 కోట్ల విలువ చేసే లిక్కర్ (ఐఎంఎల్), బీర్లు అమ్మి ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. ఈ అమ్మకాలతో ప్రభుత్వానికి దాదాపు రూ.29 వేల కోట్ల ఆదాయం వచ్చింది. టార్గెట్ల పేరుతో సేల్స్ విపరీతంగా ప్రోత్సహించడంతో ప్రభుత్వానికి ఇన్​కమ్ పెరుగుతోంది. అదే టైమ్​లో పెంచిన లిక్కర్ ధరలు కూడా కలిసివచ్చాయి.

మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా టాప్​లో ఉంది. రెండో ప్లేస్ లో హైదరాబాద్ ఉండగా మూడో ప్లేస్​లో నల్గొండ జిల్లా ఉంది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే రూ.7,839 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఆ తరువాత హైదరాబాద్​లో రూ.3,652 కోట్లు, నల్గొండలో రూ.3,447 కోట్లు, వరంగల్ అర్బన్​లో రూ.3,395 కోట్లు, కరీంనగర్​లో రూ.2,893 కోట్లు, మెదక్​లో రూ.2,841 కోట్లు, మహబూబ్ నగర్​లో రూ.2,415 కోట్లు, ఖమ్మంలో రూ.2,145 కోట్లు విలువజేసే సేల్స్ జరిగినట్లు ఎక్సెజ్ శాఖ తెలిపింది.