మద్యం కేసు…అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఐదోసారి ఈడీ నోటీసులు

arvind-kejriwal

న్యూఢిల్లీః ఢిల్లీ సిఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ కు మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే నాలుగు సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో తాజాగా ఐదోసారి ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి 2న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

గ‌తంలో న‌వంబ‌ర్ 2న‌, డిసెంబ‌ర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనవరి 13వ తేదీన కూడా నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ, నాలుగు సార్లూ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్‌ ప‌ట్టించుకోలేదు. ఈడీ నోటీసులు అక్రమమంటూ కొట్టిపారేశారు. తనను అరెస్ట్‌ చేసే కుట్రలో భాగంగానే నోటీసులు పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. తాజా నోటీసులపై సీఎం ఇంకా స్పందించలేదు.