కర్ణాటకలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

Siddaramaiah sworn in as Chief Minister and DK Shivakumar as Deputy Chief Minister

బెంగళూరుః కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు వారు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక,రాహుల్ గాంధీ హాజరు అయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అశోక్ గెహ్లాట్, సీఎం సుఖ్వీందర్ సింగ్, భూపేష్ బఘేల్ పాల్గొన్నారు.. యూపీఏ భాగస్వామ్య పక్షాల తరఫున బిహార్, జార్ఖండ్, ఢిల్లీ, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు వచ్చారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీకి ఆహ్వానం ఉన్నప్పటికీ.. రాలేదు. పార్టీ తరఫున సీనియర్ నాయకుడు కకోలి ఘోష్ దస్తిదార్ హాజరు అయ్యారు.

కాగా, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ఉన్నారు. చాలామంది గతంలో మంత్రులుగా పని చేసిన వారే ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తూ.. మంత్రివర్గంలో చోటు కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం.