జ్ఞాపకాలు బాధిస్తున్నాయా?

మానసిక వికాసం

ఏ బంధం అయినా శాశ్వతంగా దూరమవుతుంది. అంటే బాధగా ఉంటుంది .. ముఖ్యంగా అమ్మాయిలు, వాళ్ళ భావాలు బయటకు చెప్పుకోలేక ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు.. మరోవైపు, ఆ జ్ఞాపకాలను మర్చిపోలేక.. కొత్త బంధంలోకి అడుగుపెట్టలేక సతమతం అవుతుంటారు.. ఇలా ఎంతకాలం? ఆ స్థితి నుంచి త్వరగా బయటపడాలి.. అనుకుంటున్నారా?..

Do those memories hurt?

చాలా మంది విడిపోయిన తర్వాత వాళ్ళిచ్చిన బహుమతులను చూసుకుని బాధపడుతుంటారు.. గదిలోంచి బయటకు రాకుండా, వారి జ్ఞాపకాలతోనే బతుకుతుంటారు. మీకంటూ ఒక జీవితం ఉంటుందని మర్చిపోకండి. గతాన్ని గుర్తుచేసే వాటిని తీసి పక్కన పెట్టేయండి. ఎవరేం అనుకుంటారో, జడ్జ్ చేస్తారనో బాధను అదిమిపెట్టొద్దు. మనసు బరువు తగ్గేంతలా ఏడవండి.. తర్వాత మీపై మీరు దృష్టి పెట్టాలి..

మీతో మీరు సమయం గడపటానికి ప్రయత్నించండి . కామెడీ, కామిక్ సినిమాలను చూడండి. మనసు కాస్త కుదుట పడుతుంది. వాళ్ళను మర్చిపోలేక ఆత్రంహత్యలకు యత్నించటం, మిమ్మల్ని మీరు గాయపరచుకోవటం, చీకటి గదిలో మిగిలిపోవటం చేస్తే మీకే కాదు మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబానికీ దుఃఖం మిగిల్చినవారవుతారు. బయటకు రండి… ఆధ్యాత్మిక చింతన, యోగ వంటి వాటిని వ్యాపకాలుగా మార్చుకోండి.

ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలకు గురవుతున్నామనుకుంటే మానసిక నిపుణులను కలవండి. వాళ్ళ దగ్గర మీలాంటివారివి ఎన్నో అనుభవాలు ఉంటాయి . వాటిని వినడంతోనైనా మీ పరిస్థితిలో మార్పు వస్తుంది. చేస్తున్న ప్రయత్నాలన్నీ మీ జీవితాన్ని మీరు సరిదిద్దు కోవటానికి వేసుకుంటున్న అడుగులుగా భావించండి.

ఎవరేం అన్నా, పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి. ఏం చేసినా ఏదో ఒకటి అనేవాళ్ళు ఎప్పుడూ మన చుట్టూ ఉంటారని మర్చిపోకండి.

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/