వ్యాధుల రకాలు- నివారణ

ఆరోగ్యం- జాగ్రత్తలు

Types of Diseases- Prevention
Types of Diseases- Prevention

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. మనల్కి ఉరికిబిక్కిరి చేస్తున్న కొన్ని వ్యాధుల గురించి, వాటి నివారణ గురించి తెలుసుకుందాం.

లైఫ్‌ స్టయిల్‌ డిసీజెస్‌

అతినాగరికత, ఇండ్రస్టయిల్‌ ఎరియాలో పారిశ్రామిక దేశాల్లో, ఎక్కువగా ఆల్కహాల్‌, డ్రగ్స్‌ తీసుకోవడం లైఫ్‌స్టయిల్‌ అలవాట్లు, ఆహారం అలవాట్లు (కొవ్వు, జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం), కంప్యూటర్‌ వర్క్‌ని, విదేశీప్రయాణాలు చేయడం మొదలైనవి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా కన్పిస్తాయి. ఉదా:స్థూలకాయం, డయాబెటిస్‌, హార్ట్‌డిసీజెస్‌.

జునోటిస్‌ డిసీజెస్‌:

జంతువ్ఞల ద్వారా మనుష్యులకి వ్యాపించే వ్యాధులు. ఉదా: కొవిడ్‌-19, రేబిస్‌. 1946 డబ్లూహెచ్‌ఒ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల నిష్పత్తి ఈవిధంగా ఉంది. ఇన్ఫెక్షువల్‌ డిసీజెస్‌: 37శాతం
న్యూరోసైక్రియాటిక్‌ డిసీజెస్‌ -2శాతం, గాయాలు, యాక్సిడెంట్‌-19శాతం, కార్డియోవాస్కులర్‌ డిసీజెస్‌-14శాతం, కేన్సర్స్‌-8శాతం, నెలలు పుట్టకముందే పిల్లలు పుట్టడం-5శాతం

హిస్టరీ:

వ్యాధులకు మూలకారణం మానవాతీత శక్తులని పూర్వకాలంలో నమ్మేవారు. హిపోకాట్రిస్‌ వ్యాధులకి అంతర్గత కారణాలని తెలియచేశారు. ఆయుర్వేదంలో కఫ, పిత్త, వాతల వల్ల వ్యాధులు వస్తాయని కనుగొన్నారు. వ్యాధులకి రక్తం (చెడురక్తమే కారణమని) జలగల ద్వారా తీసివేసేవారు.

అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌, ప్రెంచ్‌ చక్రవర్తులు కూడా వ్యాధి చికిత్సకి రక్తాన్ని ఓడ్చడం వల్ల మరణించారు. వివిధ శరీరభాగాలు, వాటి కణాలు, ద్రవాల్ని పరీక్షించి వ్యాధుల్ని గుర్తించి పరీక్షించడం మొదట ఇటలీలో పునర్జువన కాలంలో ప్రారంభమైనది.

ఇటాలియన్‌డాక్టర్‌ ఆంటోనియో బెనివైనీ (1443-1502) వివిధ వ్యాధుల్ని ఒక పద్ధతి ప్రకారం డిసక్షన్‌ ద్వారా పరీక్షించి వ్యాధి కారణాన్ని గుర్తించడం జరిగింది. జియోవనీ మోర్గాగ్నీ (1632-1770), కాక్ల్‌రోకిటాన్సీ (1804-1878)లతో వ్యాధులపై పరిశోధనలు చేశారు.

సూక్ష్మశాస్త్రపితామహానీయుడైన జర్మనీ డాక్టర్‌ రుడాల్ఫ్‌విర్కో (1821-1902), జూలియస్‌ కాన్హీమ్‌ (1839-1884) వల్ల వ్యాధులు, కారణాలు, రకాలు కనుగొనడమైనది.
వ్యాధి స్వరూపం: ఇది నాలుగు విధాలుగా ఉంటుంది.

  • స్టేజ్‌ ఆఫ్‌ ససెప్టబిలిటీ: ఇది హోస్ట్‌ రెసిడ్టెన్సీ పవర్‌పై ఆధారపడి ఉంటుంది. వ్యాధి కారకాల వల్ల బాహ్యంగా కాని అంతర్గత కారణాల వల్ల శరీరంలో డిసీజ్‌ ప్రాసెస్‌ ప్రారంభమవ్ఞతుంది. ఉదా: ఇన్ఫెక్షువల్‌ డిసీజెస్‌లో సూక్ష్మజీవ్ఞలు, 2. కేన్సర్‌ ముఖ్యంగా లంగ్‌ కేన్సర్‌లో ఆస్‌బెస్టాస బైబర్స్‌ పొగాకు, సిగరెట్‌, చుట్టపొగ కారణమవ్ఞతాయి.
  • -సబ్‌క్లినికల్‌ స్టేజ్‌: డిసజ్‌ ప్రాసెస్‌ వల్ల రోగికి తెలియకుండానే పాథలాజికల్‌ ఛేంజ్స్‌ జరుగుతాయి. ఇది ఇన్‌క్యూబేషనపీరియడ్‌ (ఇన్ఫెక్షన్‌ శరీరంలో ఎంటర్‌ అయినప్పటి నుంచి వ్యాధి లక్షణాలు బైటపడేంత వరకు ఉన్న సమయం)పై ఆధారపడి ఉంటుంది.
  • ఒక్కో వ్యాధికి ఒక్కోవిధంగా ఇంక్యూబేషన్‌ పీరియడ్‌ సెక్షన్లు నిమిషాలు నుండి గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఉంటాయి.
  • సబ్‌క్లినికల్‌ స్టేజ్‌లోని వారు కారియర్స్‌గా ఉంటారు. ఉదా: మీజిల్స్‌, ఉదా: హైపర్‌ సెన్సిటివిటీ, ఎలర్జీ, టాక్సిక్‌, జునోటిక్‌ డిసీజెస్‌లో ఐపి (సెకండ్స్‌) సెకన్లు, నిమిషాలుంటుంది.
  • హైపటైటిస్‌ ఎకి ఐపి: 7వారాలు. సెల్‌ఫిష్‌ ఐపి: 30 నిమిషాలు. సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్‌ ఐపి: 6-4కి గంటలు ట్రిపనోమా పాలిడమ్‌ (సిఫిలిస్‌) ఇన్ఫెక్షన్‌-10-3- రోజులు
    సార్స్‌: 3-10రోజులు. కొవిడ్‌-19- 2-14 రోజులుంటుంది.
  • ఇంక్యూబేషన్‌ పీరియడ్‌లో వ్యాధిస్పష్టంగా తెలియదు. కాని ఈ టైమ్‌లో స్క్రీనింగ్‌, లాబరేటరీ టెస్ట్స్‌ ద్వారా వ్యాధి స్వరూపాన్ని గుర్తించి చికిత్స అందిస్తే నయమవుతుంది.
  • వ్యాధి బహిర్గతమై వ్యాధి లక్షణాలతో బాధపడేవారికి చికిత్స అందించి నయమైపోయేలోపు కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి.
  • క్లినికల్‌ స్టేజ్‌: సబ్‌క్లినికల్‌ స్టేజ్‌ నుండి క్లినికల్‌ స్టేజ్‌లోకి వ్యాధి వెళ్లగానే వ్యాధి వివిధ లక్షణాల రూపంలో కన్పిస్తుంది. ఇది మైల్డ్‌ కేసు నుండి సివియర్‌ కేస్‌ వరకు వ్ఞంటుంది. దీన్నే స్ప్రెక్టమ్‌ ఆఫ్‌ డిసీజ్‌ అంటారు.
  • ఇది ఐస్‌బర్గ్‌ ఫెనామినాలాగా (నీటిలో తేలియాడే ఐస్‌) ఉంటుంది. కొన్నిసార్లు ఎటువంటి రోగ లక్షణాలు కన్పించవు.
  • వ్యాధిని ఎంత త్వరగా నిర్ధారణ పరీక్షల ద్వారా గురించి చికిత్స అందిస్తే మంచిది. ఈ దశలో వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
  • దీన్నే డిజీస్‌ ఇన్ఫెక్టివిటీ అంటారు. ఇన్ఫెక్టెడ్‌ రోగుల్లోని వ్యాధి పాథోజెనిసిటీ వల్లనే వ్యాధి స్వరూపం క్లియర్‌గా కన్పిస్తుంది. విరులెన్స్‌ వల్ల కొన్నిసార్లు వ్యాధులు ప్రాణాపాయ పరిస్థితిని కల్పిస్తాయి.
  • రికవరీ స్టేజ్‌: రోగి ప్రివెన్షన్‌, ముందు జాగ్రత్తలు, మందులు, సర్జరీ ద్వారా చికిత్స తీసుకున్న తర్వాత రికవరీ జరుగుతుంది.

డాక్టర్‌. కె.ఉమాదేవి, తిరుపతి

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/