అపహరణకు గురవుతున్న అతివలు

క్రమేణా పెరుగుతున్న నేరాలు

women trafficking cases
women trafficking cases

గడిచిన యాభైఏళ్లలో భారతదేశంలో నాలుగు కోట్ల 58 లక్షల మంది మహిళలు కనిపించకుండా పోయారని ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన తన నివేదికలో తెలిపింది.

కాగా ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల 26లక్షల మంది మహిళలు తప్పిపోయారని, అందులో మూడోవంతు మంది భారతదేశంలోనే ఉన్నారని వెల్లడించింది.

చైనాలో అయితే ఏడు కోట్ల 23లక్షల మంది మహిళలు కనిపించకుండాపోయారని తెలి పింది. లింగవివక్ష బాలికల్లో ప్రసవం అనంతరం మరణాలు దీనికి కారణమని ఆ నివేదిక పేర్కొంది.

గత అయిదేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణా పెరుగుతూనే ఉంది.

వివిధ దేశాలకు సంబంధించిన గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అపహరణకు గురవ్ఞతున్న సుమారుగా పన్నెం డు లక్షల మందిలో నలభై శాతం చిన్న పిల్లలే ఉంటున్నారు.

బాలలను అక్రమంగా వివిధ దేశాలకు తరలిస్తున్నారు. ఈ విధంగా తరలించిన వారిచే వెట్టిచాకిరి, యాచకవృత్తి, దొంగతనాలు, కట్టు బానిసత్వం,స్మగ్లింగ్‌ తదితర దారుణమైన పనులు చేయిస్తున్నారు.

బాలికలు, యుక్తవయస్కులైన అమ్మాయిలను వివిధ దేశాల్లో వ్యభి చారం, వెట్టిచాకిరికి ఉపయోగిస్తున్నారు.

మానవ అక్రమ రవాణా అంశానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశం12వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

జాతీయ గణాంకాలను బట్టి మన దేశంలో రోజుకు సుమారు 180మంది బాలికలు అదృశ్యమవ్ఞతు న్నట్లు తెలుస్తోంది.మనదేశంలో బాలలు, మహిళల అక్రమరవాణా తీవ్రస్థాయిలో జరుగుతున్నది.

దీన్నిబట్టి రక్షణ,నిఘావ్యవస్థ వైఫల్యం చెందిందని అర్థమవుతున్నది.

భారతదేశంలో పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఛత్తీస్‌ గఢ్‌తోపాటు తెలుగు రాష్ట్రాలలో కూడా మానవ వ్యాపారం అధిక స్థాయిలో నడుస్తున్నది.

అమ్మాయిలను, మహిళలను ఉద్యోగాలు ఇప్పిస్తామనో, సినిమాలలో అవకాశాలు ఇస్తామనో అందమైన అబద్దాలతో లోబరుచుకొని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు.

లక్షలసంఖ్యలో బాలబాలికలు అదృశ్యమవ్ఞతున్నా నమోదు అవ్ఞ తన్న కేసులసంఖ్య తక్కువగా ఉంటోంది.

దుర్భలమైన చట్టాలు, నిఘా వైఫల్యం, సామాజిక అలసత్వం, పటిష్టమైన విచారణా విధానం లోపించడం మానవ్ఞల అక్రమరవాణాకు పాల్పడుతున్న వారు ఎటువంటి భయం లేకుండా పదేపదే అదే మానవ అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నారు.

ఈ అక్రమరవాణా తీవ్రతను గుర్తించి పార్లమెంటు స్థాయీ సంఘం 2015లో ఇచ్చిన సిఫా ర్సుల మేరకు రూపొందించిన ప్రత్యేక చట్టం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది.

మహిళల రక్షణకు పటిష్టమైన చట్టాన్ని రూపొం దించాలి. దానిని చిత్తశుద్ధితో అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి.

రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్న ఈ సమస్యను కట్టడి చేసేందుకు ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, పౌరసమాజం, ప్రసార మాధ్యమాలు కలిసికట్టుగా పోరాడాలి.

ఐక్యరాజ్యసమితి ప్రకారం మానవ అక్రమ రవాణా ప్రపంచంలోని ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తున్నది.

అక్రమ రవాణా అనేది ఒకరిని దోపిడీకి గురి చేయడం, బలవంతపు శ్రమ, వివాహం, వ్యభిచారం, అవయవ తొలగింపు వంటివి ఇందులో ఉంటున్నాయి.

ఈ రకమైన దోపిడీని కొన్ని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. దీన్నే మానవ అక్రమ రవాణా అని, వ్యక్తుల అక్రమ రవాణా అని, ఆధునిక బానిసత్వం అని చెబు తారు.

రక్షణశాఖతో సహా అనేక సంస్థలు మానవ అక్రమరవాణాను ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నేరంగా పేర్కొన్నా యి.

అక్రమ రవాణాదారులు ఈ నేరానికి భారీ లాభాలను ఆర్జి స్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

సెప్టెంబరు 2017లో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) ప్రపంచవ్యాప్తంగా 24.9 మిలియన్ల మంది పురుషులు, మహిళలు, పిల్లలు మానవ అక్రమ రవాణాకు బాధితులని అంచనా వేశారు.

అక్రమరవాణా బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, బాలికలు. ఐరాస గణాంకాల ప్రకారం బాధితుల్లో 51శాతంమహిళలు, మరో 20శాతం మంది బాలికలు, 71 శాతం మంది బాధితులున్నారు.

ఐక్యరాజ్యసమితి ఆఫీస్‌ ఆన్‌ డ్రగ్స్‌అండ్‌ క్రైమ్‌ 2016 గ్లోబల్‌రిపోర్ట్‌ ఆన్‌ పర్సన్‌ ఇన్‌ ట్రాఫి కింగ్‌, 2014లో 54 శాతం మంది అక్రమ రవాణా బాధితులు లైంగిక దోపిడీకిగురయ్యారు.

ఐక్యరాజ్యసమితి ప్రకారం అక్రమ రవాణా, ఇతర నేరాలతో పోలిస్తే మహిళలు దోషులుగా అక్రమ రవాణా చేసేవారిలో చాలా ఎక్కువ వాటా కలిగి ఉన్నారు.

వాస్తవానికి అక్రమ రవాణా బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, బాలికలేనని, మహిళలు, బాలికలను అక్రమంగా రవాణా చేయడం లో మహిళలు కూడా సాధారణంగా పాల్గొంటున్నారని కోర్టుకేసులు చూపించాయి.

ప్రత్యేకించి ఇతర మహిళలను అక్రమ రవాణాకు నియమించడానికి మహిళలు తరచూ ఉపయోగించబడుతున్నారని డేటా చూపించింది.

ప్రపంచవ్యాప్తంగా అధికసంఖ్యలో బాధితుల కేసులు ఉన్నప్పటికీ మానవ అక్రమ రవాణా కేసులలో ప్రాసిక్యూ షన్‌ రేట్లు తక్కువగా కనిపిస్తాయి.

ఈ ఆధునిక బానిసత్వంలో అంతర్జాతీయంగా 20 మిలియన్ల నుండి 40 మిలియన్ల మంది ఉన్నారని అంచనా.

ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమరవాణా పూర్తి పరిధిని అంచనా వేయడం చాలా కష్టం అవ్ఞతోంది. ఎందు కంటే కేసులు చాలా తొందరగా గుర్తించబడవు.

అంతర్జాతీయంగా మానవ అక్రమ రవాణా కేసుల్లో ప్రాణాలతో బయటపడిన వారిలో కేవలం 0.04 శాతం మంది మాత్రమే గుర్తించబడ్డారని అంచనా లు సూచిస్తున్నాయి.

దీన్నిబట్టి మానవ అక్రమ రవాణా కేసుల్లో అధికభాగం గుర్తించబడలేదు. మానవ అక్రమరవాణా వల్ల అక్రమ రవాణాదారులు సంవత్సరానికి సుమారు 150 బిలియన్ల డాలర్ల లాభాలను ఆర్జిస్తున్నారు.

వీటిలో 90 బిలియన్‌ డాలర్లు వాణిజ్య లైంగిక దోపిడీ నుండి వస్తున్నాయని అంచనా.

అయితే ప్రపంచ వ్యాప్తంగా బానిసలుగా ఉన్నవారిలో 71 శాతం మహిళలు, బాలి కలు, పురుషులు, బాలురు 29 శాతం ఉన్నారు. చాలా మంది బాధితులు ఇంటి నుంచి పారిపోయిన బాలికలు లైంగిక వేధింపుల కు గురైనవారీగా ఉంటున్నారు.

నేడు దేశంలో మహిళలకు భద్రత కల్పించడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మహిళలరక్షణ కోసం హిమ్మత్‌, హ్యాక్‌ఐ, 112ఇండియా, బి సేఫ్‌,100 వంటి అనేక భద్రతా యాప్స్‌, హెల్ప్‌లైన్స్‌ఏర్పాటు చేశాయి.

గ్యాడ్జెట్లను దగ్గర ఉంచుకోవడం మంచిదంటున్నారు.అందులోభాగంగా పెప్పర్‌స్ప్రేలు, జెల్‌లూ వాడకంలోకి వచ్చాయి.కరాటే,జూడో వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ మహిళలకి నేర్పాలి.

రత్నాల రాళ్లను పోలి ఉండే ‘సేఫర్‌ లాకెట్స్‌ వేసుకున్నా నిర్భయంగా బయటకు వెళ్లిరావచ్చు.

బాలికలకు,మహి ళలకు వీటిని ఉపయోగించి భద్రత, రక్షణపొందేలా అవగాహన కల్పించాల్సిన అవసరం నేడు ప్రభుత్వాలపై ఉంది.

  • ఆత్మకూరు భారతి

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/