సెప్టెంబర్ 10 కంటే ముందే స్ట్రీమింగ్ కాబోతున్న టక్ జగదీష్

నాని , రీతూ వర్మ జంటగా నిన్ను కోరి ఫేమ్ శివనిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ టక్ జగదీశ్. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు అంతకంటే ముందే స్ట్రీమింగ్ కాబోతుంది.

గతంలో నానితో ‘నిన్ను కోరి’ వంటి సూపర్ హిట్ తీసిన శివ నిర్వాణ ఇప్పుడు ‘టక్ జగదీష్’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. అనివార్య కారణాలతో ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు. దీన్ని గత సమ్మర్‌లోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా.. కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. దీంతో ఇది పలుమార్లు వాయిదా పడింది. మొన్నటి వరకు ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని అంత అనుకున్నారు. కానీ చివరకు ఓటిటికే నిర్మాతలు మొగ్గు చూపించారు. రీసెంట్ గా రిలీజ్ అయినా ట్రైలర్ సినిమా ఫై అమాంతం అంచనాలు పెంచింది.

‘భూదేవిపురం గురించి మీకో కథ చెప్పాలి’ అంటూ వీరేంద్ర అనే విలన్ గా డేనియల్ బాలాజీ ని చూపించడంతో ఈ ట్రైలర్ మొదలైంది. జగదీష్ తండ్రిగా నాజర్ కనిపిస్తుండగా.. అన్న బోసుగా జగపతిబాబు నటించారు. నాని ప్రేయసి గుమ్మడి వరలక్ష్మిగా రీతూ వర్మ నటించగా.. మరదలి పాత్రలో ఐశ్వర్య రాజేష్ కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటుగా ఈ సినిమాలో యాక్షన్ కూడా కావాల్సినంత ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఇక ఇప్పుడు వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 న కాదు ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 9న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారట. ఆరోజు రాత్రి 10 గంటల నుంచే స్ట్రీమింగ్ కానుందని సమాచారం. దీనికి సంబదించిన అధికారిక ప్రకటన మరో రెండు రోజుల్లో రానుందని అంటున్నారు.