నా రాజకీయ గురువు చంద్రబాబే – దివ్యవాణి

టీడీపీ మాజీ నేత , నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు మాకు ఎప్పుడు రాజకీయ గురువే అని , ఆయనంటే మాకు గౌరవం ఎప్పుడు ఉంటుందని అన్నారు.

చంద్రబాబు అని మేము రాజకీయంగా ప్రేమించే వ్యక్తులము. పార్టీ లోపల ఉన్నటువంటి కొందరు వ్యక్తుల ప్రవర్తన వల్ల నేను టీడీపీ పార్టీ నుండి బయటకు రావాల్సి వచ్చిందని, పార్టీ వీడిన తర్వాత దాదాపు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలు నన్ను సంప్రదించాయి… నేను చాలా రోజులు ఆగి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడానికి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ప్రస్తుతానికి ఈ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెనర్ గా ఉంటున్నానన్నారు.