వివేక్‌కు ఈడీ బిగ్ షాక్..

ed-and-it-raids-in-vivek-residence-ended

తెలంగాణ ఎన్నికల సమయంలో ఐటీ రైడ్స్ నేతలను నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల ఇళ్ల ఫై , ఆఫీస్ ల ఫై పెద్ద ఎత్తున దాడులు జరుపుతున్నారు. తాజాగా మాజీ ఎంపీ, మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్‌ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఈడీ.. వివేక్​కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌ ద్వారా తాజాగా 100కోట్ల నగదు బదిలీ జరిగినట్లు తెలిపింది.

వివేక్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ ​లిమిటెడ్ ​నుంచి విజిలెన్స్ ​సెక్యూరిటీ సర్వీసెస్​ సంస్థకు వెళ్లిన రూ. 8 కోట్లు.. వ్యాపారంలో భాగంగా జరిగిన లావాదేవీ కాదని ఈడీ అధికారులు తెలిపారు. విజిలెన్స్ ​సెక్యూరిటీ సంస్థ ఫెమా చట్టాన్ని ఉల్లంఘించిందని, వివేక్ కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా పేర్కొన్న ఈడీ అధికారులు ఆయనపై ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఈడీ అధికారులు మంగళ, బుధవారాల్లో వివేక్‌కు చెందిన ఇంటితో పాటు విశాఖ ఇండస్ర్టీస్, విజిలెన్స్ ​సెక్యూరిటీ కార్యాలయాల్లో సోదాలు జరిపారు. వాస్తవానికి విజిలెన్స్ ​సెక్యూరిటీ సర్వీసెస్​ వివేకానంద పరోక్ష నియంత్రణలో నడుస్తున్నట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వివేకానంద, ఆయన భార్య, ఆయనకు చెందిన కంపెనీలు విజిలెన్స్​ సెక్యూరిటీ సర్వీసెస్‌తో 100 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిపినట్టుగా తమ విచారణలో నిర్ధారణ అయ్యిందన్నారు ఈడీ అదికారులు. ఈ లావాదేవీల్లో 20 లక్షల రూపాయల లాభం కూడా వచ్చినట్టు బ్యాలెన్స్​ షీట్​లో పేర్కొన్నారన్నారు.