ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి..

7,219 ఎంపీటీసీ స్థానాల్లో 5,998 వైస్సార్సీపీకే
826 స్థానాలతో సరిపెట్టుకున్న టీడీపీ
515 జడ్పీటీసీ స్థానాల్లో 502 చోట్ల వైస్సార్సీపీ విజయ భేరి

అమరావతి : ఏపీ లో నిన్న ఉదయం ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి దాటాక పూర్తయింది. రాత్రి రెండు గంటల సమయంలో అధికారులు ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 7,219 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా 5,998 స్థానాలను వైస్సార్సీపీ గెలుచుకుంది. 826 స్థానాల్లో టీడీపీ విజయం సాధించగా, జనసేన 177, బీజేపీ 28, సీపీఎం 15, సీపీఐ 8, స్వతంత్రులు 157 స్థానాల్లో విజయం సాధించారు. అలాగే, 515 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైస్సార్సీపీ 502, టీడీపీ 6, జనసేన 2, సీపీఎం, స్వతంత్రులు చెరో స్థానంలో విజయం సాధించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/