గాడ్ ఫాదర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం పట్ల సల్మాన్ ఆనందం

గాడ్ ఫాదర్ హిట్ టాక్ రావడం పట్ల బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఆనందం వ్యక్తం చేసారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ దసరా సందర్బంగా గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా.. RB చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించగా , థమన్ మ్యూజిక్ అందించారు. ఇక ఆచార్య మూవీ ప్లాప్ కావడంతో మెగా అభిమానులు గాడ్ ఫాదర్ మూవీ ఫై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా ఉందని ప్రేక్షకులు చెపుతూ వస్తున్నారు. సోషల్ మీడియా లోను సినిమా ఫై పాజిటివ్ గా స్పందిస్తూ వస్తున్నారు. ఇక ఈ మూవీ లో కీలక పాత్రలో మెప్పించిన సల్మాన్..సినిమా విజయం పట్ల చిరంజీవి విషెష్ తెలిపారు.
‘మైడియర్ చిరుగారు..ఐ లవ్ యూ..గాడ్ ఫాదర్ చాలా బాగా ఆడుతుందని విన్నా. మీకు నా శుభాకాంక్షలు. మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. వందేమాతరం..’అంటూ వీడియో సందేశాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు సల్మాన్ . ఈ వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది. లూసిఫర్ తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన గాడ్ ఫాదర్లో పూరీ జగన్నాథ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార సత్యప్రియ జయదేవ్ పాత్ర పోషించింది. సునీల్, బ్రహ్మాజీ ఇతర కీ రోల్స్ పోషించారు.