తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్

ఈరోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ సిబ్బంది ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే ఈరోజు ఏపీ హైకోర్టు జడ్జి మానవేంద్రనాథ్ రాయ్, తెలంగాణ హైకోర్టు జడ్జి వెంకటేశులు,టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, వైసీపీ ఎమ్మెల్యే వాసుబాబు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే..ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. నాగ వంశీ నిర్మిస్తున్న ఈ మూవీ లో పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.