వీరసింహారెడ్డి ఫస్ట్ డే కలెక్షన్స్

నందమూరి బాలకృష్ణ – శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ వీరసింహారెడ్డి . సంక్రాంతి కానుకగా జనవరి 12 న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అఖండ తర్వాత బాలయ్య నుండి సినిమా రావడం ..ట్రైలర్ , సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి రేపడం తో ఫస్ట్ డే సినిమాను చూసేందుకు బాలయ్య అభిమానులతో పాటు సినీ లవర్స్ పోటీపడ్డారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ డే కలెక్షన్ల మోత మోగించింది.

మొదటి రోజు ఈ సినిమా ఏకంగా 32 కోట్ల రూపాయలను నెట్ వసూల్ చేసింది. విడుదలైన తొలి రోజు ఈ చిత్రం రూ.50 కోట్ల మార్కును అందుకున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. నైజాం, సీడెడ్, ఈస్ట్, వెస్ట్, ఉత్తరాంధ్ర అన్ని చోట్లా అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. విడుదలైన తొలి రోజే అన్ని ప్రదేశాల్లో కలిపి మొత్తం రూ.50 కోట్ల గ్రాస్‌ను(రూ.32 కోట్ల నెట్) అధిగమించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా అమెరికాలో ఒక్కరోజే 708,000 డాలర్ల వసూళ్లను అందుకున్నట్లు అంచనా. త్వరలోనే మిలియన్ డాలర్లను అధిగమిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.