అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌కు చోటు

అంతర్జాతీయంగా హైదరాబాద్ కు 202వ స్థానం

hyderabad-is-world’s-202th-costliest-city

హైదరాబాద్ః భారత్ లో అత్యంత ఖరీదైన నగరంగా ముంబయి అగ్ర స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో 147 స్థానంలో ఉంది. ఈ వివరాలను మెర్సర్స్ 2023 జీవన వ్యయ సర్వే నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా ఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్ 202, కోల్ కతా 211, పూణె 213 స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 227 పట్టణాలను సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా హాంగ్ కాంగ్, సింగపూర్, జ్యూరిచ్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. నివాసం, ఆహారం, రవాణా, ఇంటి వస్తువులు, వినోదానికి అయ్యే ఖర్చు, వస్త్రాలు ఇలా 200 వ్యయాల ఆధారంగా నివేదికను రూపొందించారు. మల్లీ నేషనల్ కంపెనీలు విదేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలంటే ముంబయి, ఢిల్లీ వ్యయాల పరంగా అనుకూలమని నివేదిక తెలిపింది. ఈ జాబితాలో తక్కువ ఖరీదైన నగరాల్లో పాకిస్థాన్ కు చెందిన కరాచీ, ఇస్లామాబాద్ ఉన్నాయి.