ప్రముఖ డైరెక్టర్ కె.వాసు కన్నుమూత..

చిత్రసీమ లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ డైరెక్టర్ కె.వాసు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయనకు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు నెలలుగా ఆయనకు డయాలసిస్ కూడా చేస్తున్నారు.

ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించారు. ఆడపిల్లల తండ్రి చిత్రంతో డైరెక్టర్ గా పరిచమయ్యాడు. చిరంజీవి మొదటి చిత్రం ప్రాణం ఖరీదు కె.వాసు దర్శకత్వంలోనే వచ్చింది. అయ్యప్పస్వామి మహత్మ్యం, శ్రీ షిర్డీసాయిబాబా మహత్మ్యం వంటి ఆధ్యాత్మిక చిత్రాలతోనూ ఆయన హిట్స్ అందుకున్నారు. 2008లో తెరకెక్కించిన గజిబిజి చిత్రం చివరిది. ఈయన మరణం పట్ల సినీ ప్రముఖులు విచారణ వ్యక్తం చేస్తున్నారు. కె.వాసు మృతిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. దర్శకుడు కె.వాసు కన్నుమూశారని తెలిసి చింతించానని వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. కె.వాసు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.