కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన పవన్ కళ్యాణ్ డైరెక్టర్

ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్..కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈ విషయాన్నీ హరీష్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. భారతీయ రహదారుల ఆధునిక రూపశిల్పిని, దూరదృష్టి కలిగిన నాయకుడు నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిశానని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ‘మీతో సమయం గడిపినందుకు చాలా ఆనందంగా ఉంది సర్’ అంటూ ట్వీట్ లో ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. కేంద్రమంత్రిని కలిసిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

ప్రస్తుతం హరీష్..పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నాడు. గతంలో పవన్ – హరీష్ కలయికలో గబ్బర్ సింగ్ మూవీ వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మరోసారి ఈ కాంబో అనగానే అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ మూవీ లో పవన్ సరసన శ్రీలీల నటిస్తుంది. అలాగే నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర , గిరి , టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అశుతోష్ రాణా, గౌతమి నాగ, మహేష్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా , అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్ , ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయి , చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.