ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటిపూట విధులు..ఎక్కడంటే

సమ్మర్ వచ్చిందంటే మాములుగా స్కూల్ స్టూడెంట్స్ కు ఒంటిపూట బడులు పెడతారు..కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఒంటిపూట విధులు నిర్వహించారు పంజాబ్ సర్కార్. వేసవి తాపం నుంచి ఉద్యోగులు ఉపశమనం పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిపుణులతో చర్చించిన అనంతరం సీఎం భగవంత్ మాన్ కార్యాలయం ఓ ప్రకటన చేసింది.

విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందుకు ఎండల నుంచి ఉద్యోగులకు, పనుల నిమిత్తం వెళ్లే ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వ ఆఫీసుల పని వేళలు మార్చాలని నిర్ణయించింది. పిల్లలకు ఒంటి పూట బడుల తరహాలోనే ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని పంజాబ్ సీఎం భగవత్ మన్ శనివారం తెలియచేశారు . ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంజాబ్‌లోని గవర్నమెంట్ ఆఫీసులు పని చేస్తున్నాయి. మే 2 నుంచి నూతన పని వేళల ప్రకారం ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. వేసవి తీవ్రత తగ్గుముఖం పట్టేంత వరకు అంటే జులై 15 వరకు ఈ టైమింగ్స్‌నే ఉద్యోగులు పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు సహా ఎంతో మందిని సంప్రదించి, వారితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని పంజాబ్ సీఎం ప్రకటించారు.