ఆదిపురుష్ నుండి ‘ఆదియు అంతము’ ఫుల్ సాంగ్ రిలీజ్

ప్రభాస్ – కృతి సనన్ జంటగా ఓం రనౌత్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఆదిపురుష్. జూన్ 16 న పాన్ ఇండియా మూవీ గా భారీ ఎత్తున పలు భాషల్లో విడుదలైంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి మూడు రోజులు భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డ్స్ సృష్టించింది.

కాగా ఈ మూవీ నుండి ‘ఆదియు అంతము రాముడిలోనే .. మా అనుబంధము రాముడితోనే’ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ ను మేకర్స్ సోమవారం విడుదల చేసారు. సీతారాములపై చిత్రీకరించిన ఈ పాటకి, సాహిత్యంతో పాటు మంచి విజువల్స్ తోడయ్యాయి. సినిమాలోని డైలాగ్స్ లో రాఘవ – జానకి అంటూ వింటూ వచ్చిన ప్రేక్షకులకు, ఈ పాటలో సీత – రామ్ అని వినిపించగానే మనసు ఊరట చెందుతుంది. అలాంటి అద్భుతమైన సాంగ్ విడుదల కావడం తో అభిమానులు విపరీతంగా తిలకిస్తున్నారు. మీరు కూడా ఈ సాంగ్ ఫై లుక్ వెయ్యండి.

YouTube video