సిరివెన్నెల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు స్పందన

సీనియర్ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థత గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కిమ్స్‌లో జాయిన్ అయ్యి రెండు రోజులు అవుతున్నప్పటికీ కుటుంబ సభ్యులు కానీ , చిత్ర యూనిట్ కానీ ఎలాంటి స్పందన లేకపోయేసరికి అభిమానుల్లో ఖంగారు మొదలైంది.

ఈ క్రమంలో సిరివెన్నెల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు స్పందించారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని.. ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్సను వైధ్యులు అందిస్తున్నారు. అతి త్వరలోనే పూర్తిగా కోలుకుని మళ్లీ మన ముందుకు ఆయన వస్తారు. ఆయన మునుపటి ఉత్సాహంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారనే నమ్మకంను వారు వ్యక్తం చేశారు.

1986లో విడుద‌లైన ‘సిరివెన్నెల‌’ చిత్రంతో గేయ ర‌చ‌యిత గా సినీ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు సీతారామ‌శాస్త్రి. మొదటి సినిమాతోనే ఆయ‌న‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఆయ‌న పాటల ర‌చ‌యితగా రాణిస్తూ వస్తున్నారు. మూడున్న‌ర దశాబ్దాలుగా ఆయ‌న ఎన్నో వేల పాట‌ల‌ను రాశారు. ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. పాట ఎలాంటిదైనా అందులో తెలియ‌ని ఓ స్ఫూర్తిని నింపి రాయ‌డం ఆయనకు మాత్రమే చెల్లింది. అందుకనే తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ఆయ‌నెంతో ప్రీతిపాత్రుడ‌య్యారు.