బాక్స్ ఆఫీస్ వద్ద కుమ్మేస్తున్న ‘దసరా’

నాని నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ దసరా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. విడుదలకు ముందే ట్రైలర్ , టీజర్ , సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీ..సినిమా సైతం అంతకు మించి ఉండడం తో ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఫస్ట్ డే రూ.38 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించి ఈ చిత్రం నాని కెరీర్ బెస్ట్ మూవీగా నిలించింది. పాన్ ఇండియాలోనే కాదు.. ఓవ‌ర్ సీస్‌లోనూ ద‌స‌రా సినిమా వ‌సూళ్లు రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

మార్చి 30 (గురువారం)న ఈ సినిమా ప్రీమియ‌ర్స్‌తో క‌లిపి 9 ల‌క్ష‌ల డాల‌ర్స్‌ను క‌లెక్ట్ చేసింది. ఇక శుక్ర‌వారం నాటికి ఇది 1.2 మిలియ‌న్ డాల‌ర్స్‌ను ట‌చ్ చేసింది. నాని సినిమాల‌కు ఓవ‌ర్ సీస్ ఆడియెన్స్‌లో ఓ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడ‌ది మ‌రోసారి ప్రూవ్ అయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజున దాదాపు రూ.15 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అంటే రెండు రోజుల్లో (రూ.52.40 కోట్లు) దాదాపు రూ.53 కోట్లు గ్రాస్ వ‌సూళ్ల‌ను ద‌సరా సినిమా రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాల టాక్‌.

రెండో రోజు…నైజాంలో రూ. 3.48 కోట్లు, సీడెడ్‌లో రూ. 66 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 64 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 24 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో కలిపి.. రూ. 5.86 కోట్లు షేర్, రూ. 9.60 కోట్లు గ్రాస్ వచ్చింది.