పల్లెల్లో బలగం సినిమా ప్రదర్శనను అడ్డుకోవడానికి కారణం అదే – దిల్ రాజు

దిల్ రాజు నిర్మించిన బలగం మూవీ అద్భుతమైన విజయం సాధించడమే కాదు యావత్ తెలుగు ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. గతంలో పల్లెల్లో టీవీలు పెద్దగా లేని సమయంలో తెరలు కట్టి సినిమాలు ప్రదర్శించే వారు. రాను రాను టీవీలు పెరిగిపోవడం,నగరాల్లో మల్టిప్లెక్సీ లు రావడం .. ఇంటర్ నెట్ వాడకం పెరిగిపోవడం తో పల్లెల్లో తెరలు కట్టి సినిమాలు ప్రదర్శించడం కనుమరుగైపోయింది. తాజాగా బలగం సినిమాతో మళ్లీ పల్లెల్లో తెరలు కట్టి సినిమాను ప్రదర్శించడం మొదలైంది. అయితే ఇలా బలగం సినిమాను ప్రదర్శించడం ఫై నిర్మాత దిల్ రాజు పోలీసులకు పిర్యాదు చేసాడు.

దీంతో కొంతమంది దిల్ రాజు తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు‌కు మనసు లేదని, ఆయనకు సంపాదన మాత్రమే కావాలని విమర్శించారు. ఈ విమర్శలపై దిల్ రాజు తాజాగా స్పందించారు. ‘బలగం’ సినిమా సక్సెస్‌పై మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో ప్రియదర్శి, దర్శకుడు వేణు, నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డిలతో కలిసి ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న దిల్ రాజు.. తాను చేసిన ఫిర్యాదు గురించి కూడా మాట్లాడారు. మాకు కొన్ని చట్టపరమైన సమస్యలు ఉంటాయి. సినిమా తీసిన నిర్మాత ఓటీటీకి, శాటిలైట్‌కు ఇస్తాడు. ఓటీటీకి ఇచ్చినప్పుడు వాళ్ల దగ్గర నుంచి మాకు ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి వచ్చింది.. మాకు మెయిల్ పెట్టారు. ఇది కరెక్ట్ కాదు.. భవిష్యత్తులో అన్ని సినిమాలకు ఇలానే అయిపోతుందేమో అని వాళ్ల భయం. దాని కోసం మా లీగల్ టీమ్ ఒక ముందడుగు వేసిందే తప్ప సినిమా ఆపాలనే ఉద్దేశం మాకు లేదు’ అని దిల్ రాజు స్పష్టం చేశారు.