బన్నీ పుట్టిన రోజుకు సుకుమార్ రెండు సర్‌ప్రైజ్‌ లు ఇవ్వబోతున్నారట

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏప్రిల్ 08 న పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ క్రమంలో ఆ రోజు పుష్ప 2 కు సంబంధించి రెండు సర్‌ప్రైజ్‌ లు ప్లాన్ చేశారట డైరెక్టర్ సుకుమార్. వాస్తవానికి పుష్ప మూవీ వచ్చిన దాదాపు ఏడాదిన్నర కావొస్తున్నా పుష్ప 2 కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో అభిమానులు సినిమా అప్డేట్ కోసం మేకర్స్ ను తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలో అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని దర్శకుడు సుకుమార్‌ భావిస్తున్నారట. బన్నీ బర్త్ డే(ఏప్రిల్‌ 8) సందర్భంగా ఏకంగా రెండు సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేసినట్టు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు ఏప్రిల్‌ 7న పుష్ప 2 నుంచి కాన్సెప్ట్ టీజర్‌ విడుదల చేయబోతున్నారట. ఆ తర్వాత నెక్ట్స్ డే పుట్టిన రోజు సందర్భంగా బన్నీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనిపై రేపు ఉదయం క్లారిటీ రానుంది.

సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్పః ది రూల్‌ సినిమాలో బన్నీతోపాటు ఆయనకు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. మలయాళ హీరో ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారు. సునీల్‌, అనసూయ వంటి వారు నటిస్తున్నారు. మొదటి భాగంలో పుష్పరాజ్‌(బన్నీ) అనేక స్ట్రగుల్స్ ఫేస్‌ చేసి ఎర్రచందనం స్మగ్లింగ్‌ లీడర్‌గా ఎదుగుతాడు. ఇక రెండో భాగంలో ఆయన రూలర్‌గా కనిపించబోతున్నారట. ఆయన రూలింగ్‌, డౌన్‌ ఫాలింగ్‌ ఇందులో ఉండబోతున్నాయని, దీంతోపాటు కొన్ని షాకింగ్‌ ట్విస్ట్ లు కూడా ఉండబోతున్నాయని సమాచారం.