గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్ లావాదేవీలు
రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో ప్రారంభం

Amaravati: గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్ లావాదేవీలు ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు.
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ), కెనరా బ్యాంక్‌ల సహకారంతో సచివాలయాల్లో యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో డిజిటల్ లావాదేవీలు ప్రారంభం అయ్యాయి. గ్రామ వార్డు, సచివాలయాల్లో ప్రస్తుతం 543 రకాల సేవలను ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే.
వినియోగదారులు ఇక నుంచి ఈ సేవలను అవసరమైతే డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/