సిఎం కెసిఆర్‌ను కలిసిన నూతన డీజీపీ అంజనీ కుమార్‌

dgp-anjani-kumar-met-cm-kcr-at-pragathi-bhavan

హైదరాబాద్ః తెలంగాణ నూత‌న డీజీపీ అంజ‌నీ కుమార్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కెసిఆర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. త‌న‌కు డీజీపీగా అవ‌కాశం క‌ల్పించినందుకు సీఎం కెసిఆర్‌కు డీజీపీ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా అంజ‌నీ కుమార్‌కు సీఎం కెసిఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

కాగా, తెలంగాణ నూత‌న డీజీపీగా అంజ‌నీ కుమార్ శ‌నివారం మ‌ధ్యాహ్నాం బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, సీపీలు సీవీ ఆనంద్, మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌తో పాటు ప‌లువురు పోలీసు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అంజ‌నీ కుమార్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇవాళ ఉద‌యం తెలంగాణ స్టేట్ పోలీసు అకాడ‌మీలో మ‌హేంద‌ర్ రెడ్డి ప‌ద‌వీ విర‌మ‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/