సుడిగాలి సుధీర్ ను తక్కువ చేసిన అనసూయ

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ బుల్లితెర కు పరిచయమయ్యారు. ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్..వెండితెర ఫై రాణిస్తున్నారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. జబర్డస్త్ ద్వారా ఫేమస్ అయినా సుధీర్ ఆ తర్వాత యాంకర్ గా ఛాన్సులు కొట్టేసాడు. ఇదే క్రమంలో వెండితెర ఫై సైడ్ క్యారెక్టర్ నుండి హీరోగా ఎదిగాడు. తాజాగా సుధీర్ నటించిన గాలోడు మూవీ సూపర్ హిట్ అయ్యి , భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ఈయన తో సినిమాలు చేసేందుకు అగ్ర దర్శక , నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో యాంకర్ అనసూయ సుధీర్ ను తక్కువ చేసి మాట్లాడడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో ఓ టీవీ యాంకర్‌ సుధీర్‌తో వర్క్ చేయడం ఎలా ఉందని అనసూయని ప్రశ్నించారు. దీనికి సాధరణంగా అందరూ కంఫర్ట్ అని లౌక్యంగా చెపుతారు. కాని అనసూయ మాత్రం అనవసరమైన కామెంట్ చేసింది.సుధీర్‌ నాకు జూనియర్, ఆ విషయం మీకు తెలియదా అంటూ, ఈ ప్రశ్న ఆయన్నే అడగాలి అంటూ తాను తనకంటే సీనియర్ అని అర్దం వచ్చేలా అంది. దీనితో సుధీర్‌ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. దీంతో అనసూయని సోషల్ మీడియాలో ఆమె బిహేవియర్ గురించి , గతంలో వివాదాల పై ట్రోల్ చేయటం స్టార్ట్ చేశారు.