యూపీలో మరోసారి ఐటీ దాడుల కలకలం
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఇంటిలో సోదాలు
income tax department
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో మరో పెర్ఫ్యూమ్ వ్యాపారి ఇంటిపై శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ వ్యాపారి పేరు పుష్పరాజ్ జైన్ పంపి. సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అయన 2022 కోసం 22 పువ్వులతో తయారు చేసిన సమాజ్‌వాదీ పెర్ఫ్యూం విడుదల చేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇంకా ఆయన ఇంటిలో సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు.
పుష్పరాజ్ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు సన్నిహితుడు.. పార్టీకి పెద్ద ఫైనాన్షియర్ అని చెబుతున్నారు. పీయూష్ జైన్ పై ఐటీ దాడుల తరువాత జరుగుతున్న ఈ దాడి ప్రస్తుతం సంచలనం గా నిలిచింది. పుష్పరాజ్ జైన్ ఇల్లు కూడా పీయూష్ జైన్ ఇంటికి కొద్ది దూరంలోనే ఉంది. ఈయన నిత్యం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యేవాడు. ఇది కాకుండా, కన్నౌజ్‌లోని మరో పెర్ఫ్యూమ్ వ్యాపారి మాలిక్ మియాన్ ఆవరణలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. గత సారి కూడా పుష్పరాజ్ రహస్య స్థావరాలపైనె ఐటీ శాఖ దాడులు చేసేందుకు సిద్ధమైంది. అప్పుడు రహస్య సంకేతంగా పి కోసం బృందం వెతుకులాట మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఐటీ టీమ్ అనుకోకుండా పీ అంటే పుష్పరాజ్ బదులు పీ అంటే పీయూష్ జైన్ ఇంటికి చేరుకుంది.
కాగా శుక్రవారం ఉదయం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల ఏకకాలంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. కన్నోజ్‌తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తమ పార్టీ నేతలను టార్గెట్ చేశారని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. యుపీ ఎన్నికల వేళ ఈ ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/