మాజీ పోప్‌ బెనెడిక్ట్‌ అస్తమయం

ఈ ఉదయం 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారన్న వాటికన్ సిటీ

ex-pope-benedict-passes-away

వాటికన్‌ః రోమన్ క్యాథలిక్కుల మత గురువు మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్టు వాటికన్ సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. బెనెడిక్ట్ వయసు 95 సంవత్సరాలు. కొన్ని రోజులుగా బెనెడిక్ట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హృద్రోగ సమస్యతో పాటు ఇతర వ్యాధులకు కూడా చికిత్స తీసుకుంటున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ ఉదయం 9.30 గంటలకు ప్రాణాలు వదిలినట్టు వాటికన్ సిటీ ప్రతినిధులు వెల్లడించారు. జనవరి 2 నుంచి సెయింట్ పీటర్స్ బేసిలికా వద్ద పోప్ భౌతికకాయాన్ని ఉంచుతామని తెలిపారు.

కాగా, క్యాథలిక్‌ మతాధిపతిగా వ్యవహరించిన బెనెడిక్ట్ XVI 2013లో వృద్ధాప్య కారణాలతో పోప్‌ పదవికి రాజీనామా చేసి కేథలిక్ క్రైస్తవులను దిగ్భ్రాంతికి గురి చేశారు. ఆరోగ్యం క్షీణించడం వల్ల పోప్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో బెనెడిక్ట్‌ ప్రకటించాడు. దాదాపు 600 ఏండ్లలో పోప్ పదవి నుంచి ఇలా అర్ధాంతరంగా వైదొలగడం ఇదే తొలిసారి. ఈయన కంటే ముందు 1415లో క్రైస్తవుల రెండు గ్రూపుల మధ్య ఘర్షణల కారణంగా గ్రెగొరీ XII రాజీనామా చేశాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/national/